టెస్ట్ క్రికెట్‌లో భారత పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలిసారి 1000 పరుగుల మార్కును అందుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఈ అరుదైన రికార్డు సాధించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో 1,000 పరుగులు దాటిన ఆరో జట్టుగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో మొత్తంగా భారత్ 1014 పరుగులు చేసింది. గతంలో టీమిండియా…