ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేయాలంటూ విజయవాడలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తమ ప్రభుత్వం అవకాశం ఉన్నంతవరకు ప్రతి అంశాన్ని పరిష్కరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు. విద్యా శాఖలో సంస్కరణలు దశలు వారీగా వస్తాయన్నారు.…
శాంతిభద్రతల నేపథ్యంలో బెజవాడలో హై అలెర్ట్ విధించారు పోలీసులు. సీపీఎస్ రద్దుని కోరుతూ ఛలో సీఎంఓకు యూటీఎఫ్ పిలుపివ్వడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. విజయవాడకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో భారీగా మొహరించారు పోలీసులు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు విధులలో వున్నారు. సర్వీస్ నుంచి నేషనల్ హైవే మీదకి రాకుండా మధ్యలో ఫెన్సింగ్.. ముళ్ల కంచెలతో భద్రత ఏర్పాటుచేశారు. పొట్టిపాడు, దావులూరు, కాజా చెక్ పోస్టుల వద్ద…