పశ్చిమ బెంగాల్‌లో 25,000 టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దీంతో వాళ్లంతా రోడ్డున పడ్డారు. సుప్రీం ధర్మాసనం తీర్పుపై ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.