Minister Kakani Govardhan Reddy: గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యిందని వ్యాఖ్యానించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు.. కోటి 45 లక్షల కుటుంబాలను పార్టీ నేతలు కలిశారు.. కులాలు.. వర్గాలు.. పార్టీలకు అతీతంగా పథకాలను ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో కలెక్టర్ కు కూడా అధికారాలు లేవు.. అప్పట్లో జన్మ భూమి కమిటీలే లబ్ధిదారులను నిర్ణయించేవారన్న ఆయన.. ఇప్పుడు…
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల వేదికగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని విమర్శలు గుప్పించిన ఆమె.. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందని పేర్కొన్నారు.. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు రజనీకాంత్‌తో అబద్ధాలు చెప్పించారని ఫైర్ అయ్యారు.. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తానన్న రోజా.. ఎన్టీఆర్ అభిమానులను బాధపట్టేలా రజనీ మాట్లాడారనా…
Off The Record: ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ.. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొందరు సీనియర్ నాయకుల అడుగులు చర్చనీయాంశం అవుతున్నాయి. చాలా మంది నౌ ఆర్ నెవర్ అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకుల అడుగులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతల మీటింగ్‌పై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్…
Chandrababu: స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్)కు భారతరత్న ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. స్టాట్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ కింద ఎన్టీఆర్ పేరుతో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. ఎన్టీఆర్ వారసుడు బాలయ్య.. సినిమాల్లో బాలయ్య దారే వేరన్న ఆయన.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు ఓ చరిత్రగా చెప్పుకొచ్చారు.. సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ బాలయ్య రాణిస్తున్నారు. ఎన్టీఆర్ నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ది…
Minister Merugu Nagarjuna: మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మేరుగ నాగార్జున.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితుల గురించి చంద్రబాబు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు.. చంద్రబాబు లాంటి గజ దొంగ రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. దళిత ద్రోహి చంద్రబాబు.. దళితుల కోసం చంద్రబాబు పెట్టిన ఒక మంచి కార్యక్రమం గురించి చెప్పగలవా..? అంటూ సవాల్ చేశారు.. ఈ నాలుగేళ్లలో 53 వేల కోట్లు దళితుల…
ఎన్టీఆర్ పేరు చెప్పుకుని మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ఆలోచన అంటూ ఫైర్ అయ్యారు మంత్రి రోజా.. ఎన్టీఆర్ జిల్లా అని చెప్పే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఏం చేయలేదన్నారు.. ఒక్క జిల్లాకు లేదా మండలానికి కూడా ఎన్టీఆర్ పేరు పెట్టలేదు.. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, పార్టీ గుర్తు, పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు.. పార్టీ డిపాజిట్లు కూడా లాక్కున్నారు అంటూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
Off The Record: రాజమండ్రి అర్బన్ టిక్కెట్ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ అవుతోందట. ఈసారి కూడా సీటు తమ కుటుంబానికే ఖరారు చేశారని ఇటీవల సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేసిన ప్రకటనే ఇందుకు కారణమట. పనిలో పనిగా తన కుమారుడు వాసు ఈసారి పోటీలో ఉంటారని కూడా క్లారిటీ ఇచ్చేశారట ఆయన. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్తే వాసు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారాయన. వాళ్ళు…
Off The Record: ప్రధాని మోడీ విధానాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనని ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైందట. అభివృద్ధి, టెక్నాలజీ లాంటి అంశాల్లో మోడీతో కలిసి పని చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పినా.. ఎన్డీఏకు మద్దతు ఇచ్చే విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్న బాబు కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయట. అంటే.. బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమైపోయిందా..? అనే రీతిలో…
టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన చంద్రబాబు.. దళిత బాంధవుడు ఎలా అయ్యారు? అని ప్రశ్నించారు.. దళితులపై దాడులకు కారకులైన చంద్రబాబు దళితులకు పెన్నిధి ఎలా అయ్యారు? అని నిలదీశారు.. ఎస్సీ నియోజకవర్గాలలో అధిక భాగం ఎందుకు ఓడిపోయారో అర్థం చేసుకో చంద్రబాబు అని సూచించిన ఆయన.. 28 పథకాలు దళితుల కోసం తన హయాంలో పెట్టినట్లు…
చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.. కుప్పం టీడీపీ వ్యవహారాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించారు కంచర్ల శ్రీకాంత్.