తెలుగు ప్రజలకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ మా అందరికి బాధాకరమైన విషయం.. తితిలీ తుఫాన్ సమయంలో మా జిల్లా ప్రజలతో కలిసి బాబు దసరా జరుపుకున్నారు.. ప్రజా నాయకుని అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని ఆయన ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పేరుతో సర్క్యూరేట్ అవుతున్న లెటర్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. చంద్రబాబు పేరుతో సర్కులేట్ అవుతున్న లెటర్ జైలు నుండి వచ్చింది కాదు అని తెలిపారు.
చంద్రబాబు లేఖకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ లేఖ రాశారు. 45 రోజుల జైలు జీవితం తర్వాత కూడా.. నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మారుస్తూ మీరు ఉత్తరం రాశారు అంటూ సెటైర్ వేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కా్మ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే, చంద్రబాబు నాయుడు జైలు నుంచి నా ప్రియాతి ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ లేఖ విడుదల చేశారు.
దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యనించారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దాం అంటూ ఆయన కామెంట్స్ చేశారు.
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన యాత్రలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు. మోసం చేసే హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారు.. టీడీపీ, టీడీపీకి తొత్తుగా వ్యవహరించే జనసేనకు ఓటేస్తే నష్టం తప్పదు అని వెల్లడించారు.
తెలుగు జాతి ఆస్తి.. దేశం ప్రపంచం నలుమూలల.. తెలిసే విధంగా మన పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.. చంద్రబాబు నాయుడు మీద దొంగ కేసులను, సంబంధం లేనటువంటి కేసులను బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
'నిజం గెలవాలి' పేరుతో చంద్రబాబు సతిమణి నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి ఏపీ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆవేదనతో మరణించినవారిని ఆమె పరామర్శిస్తారని టీడీపీ శ్రేణులు తెలిపారు.