హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆ జగన్మోహనుడిని అంటే..ఈ చరాచర సృష్టిని పాలించే విష్ణుమూర్తి అంశమే జగన్మోహనుడు అని..అటువంటి దైవాన్ని ఒక రాక్షసునిగా ఏ ఉద్దేశంతో టీడీపీ నేతలు చిత్రీకరించారో యావత్ భారతీయులకు వివరణ ఇవ్వాలని డిమాండు చేస్తూ వైసీపీ శ్రేణులు రాజమండ్రిలో నిరసన చేపట్టారు.
టీడీపీ, జనసేన మీటింగ్లో ఏదైనా విషయం ఉందా..? బలహీన పడ్డ టీడీపీని బలోపేతం చేయడం కోసం కలిశానని పవన్ కళ్యాణ్ చెప్ప్తున్నారు.. కానీ ప్రజలు ఈ కలయికని పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. అయితే, మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ( ఎక్స్ ) సొంత కుమారుడు.. అద్దె కుమారుడు.. ఇద్దరూ ఉత్తర కుమారులే !.. సూటుకేసు తీసుకో..లోకేషుతో కలిసిపో!.. అనే పోస్ట్ ను పెట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు.
టీడీపీ-జనసేన జేఏసీ మీటింగ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ విధానం ఏంటి అని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ కాబట్టే నీ విధానాన్ని తప్పు బడుతున్నామన్నారు. 2014లో కలిసి పోటీ చేశావ్... 2019లో విడిగా పోటీ చేశావ్.. ఏం చేసినా చంద్రబాబుకు ప్రయోజనం కలిగించటమే పవన్…
ఇవాళ్టి సమావేశం హిస్టారికల్ మీటింగ్ అని పవన్ కల్యాణ్ అన్నారు. హత్యలు చేసిన వాళ్లకూ బెయిల్ వచ్చేస్తోంది.. కానీ చంద్రబాబుకు టెక్నికల్ అంశాన్ని బేస్ చేసుకుని బెయిల్ రాకుండా చేసిందని ఆరోపించారు. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పటికే టీడీపీ ఇచ్చిన మినీ మేనిఫెస్టోతో పాటు.. జనసేన చెప్పే అంశాలను కూడా చేరుస్తామన్నారు.
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ మీటింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరుగుతుంది. సమావేశానికి జనసేన, టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్లో ఈ సమావేశం జరుగుతుంది. సీట్లు, ఓట్లు పక్కనబెట్టి పోరాటంపై దృష్టి పెట్టేందుకు ఈ భేటీ నిర్వహించారు.
పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో సామాజిక సాధికార యాత్ర సన్నాహా సమీక్ష సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పనులు చేసేవని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను తెచ్చిన చంద్రబాబు బయటకు ఎందుకు రావడం లేదని విమర్శించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయన కుమారుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి ములాకాత్ అయ్యారు.
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాకాత్ ముగిసింది అని మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు అందర్నీ ధైర్యంగా ఉండమన్నారు.. ప్రజలంతా ఆయన ఎప్పుడూ బయటికి వస్తారా అని ఎదురుచూస్తున్నారు.