చంద్రబాబు మోసగాడు, నిజం మాట్లాడని వ్యక్తి రైతును మోసం చేశాడు 87 వేల కోట్ల రుణాలు రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు.
చంద్రబాబు మెడికల్ బెయిల్ మీద మరింతకాలం ఉండడానికి వీలుగా మెడికల్ రిపోర్టు ఇచ్చినట్టుందని వైసీపీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చర్మ వ్యాధులను ప్రాణాంతక వ్యాధులన్నట్టు మెసేజ్ వచ్చేలా చేశాడన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ రోజు జరిగిన టీడీపీ - జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉందన్నారు.
ఈ జన వాహిని చూస్తుంటే వైసీపీ గెలుపు ఖాయం అనిపిస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట బస్సుయాత్ర బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఇసుకరాలనంత జనాలు సభలకు రావడం జగనన్న విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జగన్ జైత్ర యాత్రను ఆపే శక్తి ఎవరికి లేదని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేదవాడు ఆకలితో చస్తుంటే... రోడ్లు వేసి అభివృద్ది అంటే ఎలా అని.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్ధి అని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు గుండె సమస్య ఉన్నట్లు తేలింది. చంద్ర బాబు కంటి ఆపరేషన్, హెల్త్ కండిషన్ వివరాలను హైకోర్టుకు ఆయన లాయర్లు సమర్పించారు.