జనసేనలాగ మాది పావలా బేడా పార్టీ కాదు అని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నాడు.. అసలు రాష్ట్రంలో ఉంటేనే కదా పగలు ఏం జరుగుతుందో చూస్తే రాత్రికి కలలు కానొచ్చు.
కుల గణన ప్రక్రియ వాయిదా పడిందని.. ఈ నెల 27కు బదులు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వెల్లడించారు. పేదల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకే కులగణన అంటూ ఆయన పేర్కొన్నారు.
నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో అన్నీ రంగాల్లో సాధికారత సాధించామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాజకీయంగా అన్నీ వర్గాలను చెయ్యి పట్టుకుని నడిపించామని ఆయన వెల్లడించారు. గతంలో టీడీపీ హయాంలో ఎన్నికల సమయంలో మాత్రమే అణగారిన వర్గాలు గుర్తుకు వచ్చేవని మంత్రి పేర్కొన్నారు.
ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూర్ సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎటువంటి సాక్షాదారులు లేకుండా కేసులు నమోదు చేసి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి సీఐడీలను ప్రయోగించి ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణల నేపథ్యంలో.. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను టీడీపీ బృందం కలిసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక రాజకీయాల నుంచి వైదొలగాని ఏపీ దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ సలహా ఇచ్చారు. అనేక రోగాలు ఉన్నట్టు అయన తన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు.