శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగించారు. పాతపట్నంలో ఈ జనవాహిని చూస్తుంటే సముద్రం పొంగివచ్చిందా అన్న రీతిలో హాజరయ్యారన్నారు. పార్టీ పట్ల, జగన్ పట్ల, మీ నాయకురాలి పట్ల అభిమానం కనపడుతోందన్నారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనలకే పరిమితమయ్యారని మంత్రి విమర్శించారు.
రాష్ట్రంలో వైసీపీ ఇంఛార్జ్ ల మార్పుపై టీడీపీ-జనసేన పార్టీలు చేసిన విమర్శలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ- జనసేన పార్టీలు ముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోవాలి అని ఆయన చురకలంటించారు.
ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే.. గాజువాక ఇన్చార్జి కూడా వైసీపీకి రాజీనామా చేశారు.. ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉండరు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.
విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యదర్శి పార్థసారథి అన్నారు. కానీ అధికారంలోకి రాగానే మాటతప్పాడు అంటూ విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పోసాని కృష్ణ మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ కలలు కంటోందని.. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడ జగన్ గెలుస్తాడు అని చెప్పరు ఓడితే మాత్రం అది జరుగుతుంది అంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటని పోసాని ప్రశ్నించారు.
మిచౌంగ్ తుఫాన్ కొన్ని జిల్లాలను అతలాకుతలం చేసిందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తుఫాన్ వస్తుందనే సమాచారంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని.. దీని వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగిందని మంత్రి తెలిపారు. ఈ సంక్షోభం నుంచి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని.. జగన్పై బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ప్రచారం చేయటం వల్లే కాంగ్రెస్ ఓడిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడారు.. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు.