Merugu Nagarjuna: వైఎస్ కుటుంబానికి మాత్రమే పాదయాత్రపై పేటెంట్ ఉందన్నారు మంత్రి మేరుగు నాగార్జున.. నారా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేసిన ఆయన.. లోకేష్ చేసిన యాత్రను పాదయాత్ర అనలేం.. వైఎస్సార్ కుటుంబానికి మాత్రమే పాదయాత్ర మీద పేటెంట్ ఉందని వ్యాఖ్యానించారు. పేద ప్రజల కష్టాలు తెలుసుకోవటం కోసం రాష్ట్రం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ వారి కష్టాలు తీర్చారని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభించగానే వాళ్లింట్లో ఒకరు చనిపోయారు.. ఆ తర్వాత దొంగపని చేసి వాళ్ల తండ్రి దొరికిపోయారు.. జనం లేక పాదయాత్రలు ముగించేశారు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Kethireddy vs JC: జేసీకి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్.. అది నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై..!
ఇక, లోకేష్ ముగింపు సభలకు ఎంత మంది జనం వచ్చారో అందరూ చూశారన్న నాగార్జున.. మా సీఎం అక్కడకు వచ్చినా వాళ్లలో ఎవరిని చూసి భయపడతారు..? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ది ఎలాంటి గుండె అనేది అందరికీ తెలుసు.. మేం టిక్కెట్లు మార్చుకుంటే మీకెందుకు.. మా నేతను చూసి ప్రజలు మాకు ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీసీల సీట్లలో పోటీ చేసి చంద్రబాబు, లోకేష్ వారికి అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని మండిపడ్డారు. మా నాయకుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. ఆయన ఆశీస్సులు మా అందరికీ ఉంటాయి.. చంద్రబాబు ఆశీస్సులు లేకుండా ఆ పార్టీ లీడర్లు పోటీ చేస్తారా..? అని ప్రశ్నించారు. నియోజకవర్గాల్లో సమస్యలుంటే మా సీఎం జగన్, మా నేత బాలినేని పరిష్కరిస్తారని వెల్లడించారు మంత్రి మేరుగు నాగార్జున.