టీడీపీ – జనసేన మొదటి లిస్ట్‌పై నేతల అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు. అవనిగడ్డ సీటు పెండింగ్‌లో పెట్టింది టీడీపీ అధిష్టానం. టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఫేస్ బుక్ పోస్ట్ లో టీడీపీ పై, రాజకీయాలపై నైరాశ్యం వ్యాఖ్యలు చేశారు. అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారని ఇప్పటికే ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో.. పెడన సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ చంద్రబాబు, పవన్ ను కలిసిన తర్వాత…
ఏపీలో రాజకీయం వేడెక్కింది. నిన్న టీడీపీ-జనసేన పార్టీలు అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్లో అసంతృప్తి సెగలు రగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ జనసేనకు కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి వర్గం స్పందించారు.. 25 ఏళ్లుగా గతంలో సంపర, ప్రస్తుతం కాకినాడ రూరల్ టీడీపీ బీసీలకు కేటాయిస్తుందని పార్టీ నిర్ణయంతో శెట్టిబలిజలు మనస్తాపం చెందారని అంటున్నారు మాజీ…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావుని ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు సంబరాలు చేసుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు శనివారం ఉదయం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉంగుటూరు మండలం పొనుకుమాడులోని శ్రీ గంగా సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో…
వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి తమకు ఓటు వేయాలన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ సందర్భంగా టీడీపీ-జనసేన పొత్తులపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన తమ పొత్తు చూసి ఓటు వేయాలని చెబుతున్నారని విమర్శించారు. కాగా.. రాష్ట్రంలో ప్రజలు వైసీపీని రెండోసారి అధికారంలోకి తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. 24 ఎమ్మెల్యే స్థానాల్లో, మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని... మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
టీడీపీ-జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీనియర్ నేతలైన అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్‌తో సమావేశమయ్యారు.
ఏపీలో టీడీపీ-జనసేన పార్టీలు దూకుడును పెంచాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశాయి. ఇవాళ టీడీపీ - జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. ఉదయం 11 గంటల తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు - పవన్ విడుదల చేయనున్నారు.