Off The Record: ఏపీ పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ టర్మ్‌లో జరిగినంత రచ్చ ఎప్పుడూ జరగలేదు. మూడే మూడు నెలల్లో కొంతమంది ఎమ్మెల్యేలు బాగా రెచ్చిపోతున్నారనే చర్చ బలంగా నడుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఆ అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతోందట. అధికార పార్టీలో బాధ్యత లేకుండా వ్యవహరించే కొంతమంది ఎమ్మెల్యేల లిస్ట్ తయారైందట. ఉమ్మడి జిల్ల్లాల వారీగా ఎమ్మెల్యేల జాబితాపై దృష్టిపెట్టారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.…