Off The Record: బాధ్యత లేకుండా వ్యవహరించే ఎమ్మెల్యేల లిస్ట్ రెడీ..! యాక్షన్ తప్పదా..?
- ప్రభుత్వం మనదే కదా అని ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారా?..
- ల్యాండ్, శాండ్, మైన్స్ దేన్ని కూడా వదలటం లేదా?..
- పరిస్థితి చేజారిపోక ముందే హైకమాండ్ సెట్ రైట్ చేయాలని చూస్తోందా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీ పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ టర్మ్‌లో జరిగినంత రచ్చ ఎప్పుడూ జరగలేదు. మూడే మూడు నెలల్లో కొంతమంది ఎమ్మెల్యేలు బాగా రెచ్చిపోతున్నారనే చర్చ బలంగా నడుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఆ అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతోందట. అధికార పార్టీలో బాధ్యత లేకుండా వ్యవహరించే కొంతమంది ఎమ్మెల్యేల లిస్ట్ తయారైందట. ఉమ్మడి జిల్ల్లాల వారీగా ఎమ్మెల్యేల జాబితాపై దృష్టిపెట్టారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. త్వరలో వీరికి మంత్రి నారా లోకేష్ క్లాస్ తీసుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు వన్ టూ వన్ మాట్లాడారు. సీఎంతో భేటీ తర్వాత కొంతమంది సెట్ అయ్యారని తెలుస్తోంది. కానీ మరికొంతమంది పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందట. వచ్చిన నివేదికలు చూస్తుంటే అంతా నివ్వెరపోయేలా ఉందని సమాచారం.
Read Also: Anasuya Bharadwaj: అతనొక ‘నార్సిసిస్ట్’.. మా హక్కులు మాకు తెలుసు.. శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్..!
Also Read
శాండ్, ల్యాండ్, లిక్కర్ ఇలా ఒకటి కాదు రెండు కాదు…మాఫియా కొన్ని నియోజకవర్గాల్లో పాతుకుపోయి…ఉందని టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితి సెట్ చెయ్యాలని చూస్తోంది పార్టీ హైకమాండ్… ఐతే, ఎమ్మెల్యేలు ఎవరెవరు బాధ్యతారాహిత్యంగా ఉన్నారనే దానిపై ఆరా తీస్తోంది పార్టీ హైకమాండ్. ఎవరు కట్టు తప్పుతున్నారనే అంశంపై ఇప్పటికే ఒక నివేదిక రెడీ అయ్యిందట. జోనల్ ఇంచార్జ్‌లకు ఈ బాపతు ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారని గుర్తించే బాధ్యతను అప్పగించిందట అధిష్ఠానం. జోనల్ ఇంచార్జ్‌లు లిస్ట్ తయారు చేసి…అవసరం అయితే ఒకసారి ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత ఈ జాబితా లోకేష్‌కు చేరుతుందని సమాచారం.
నంద్యాల పార్లమెంట్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గాడి తప్పినట్టు రిపోర్ట్స్ వచ్చాయట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 మంది…విజయనగరం జిల్లాలో ఐదుగురు…నెల్లూరులో నలుగురు…ప్రకాశంలో ముగ్గురు.. శ్రీకాకుళం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యే లు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. వీరికి అతి త్వరలోనే మంత్రి నారా లోకేశ్‌తో క్లాస్ ఏర్పాటు చేస్తారట. కొత్త ఏడాదిలోనే ఈ ప్రోగ్రాం ఉండే అవకాశం ఉంది. ఈ స్థాయిలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంటే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందని అధిష్ఠానం గ్రహించింది. త్వరలోనే మీటింగ్స్ ఏర్పాటు చేయబోతోందట. మొత్తానికి…ఎమ్మెల్యేలతో సమావేశాల తర్వాతైనా మార్పు వస్తుందేమో చూడాలనే చర్చ అధికార పార్టీలో జరుగుతోంది.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!