ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య నెట్టింట పోస్టర్ వార్ మొదలైంది.
ఈ రోజు టీడీపీ కండువా కప్పుకోనున్న వారిలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వారి అనుచరులు కూడా ఉన్నారు.. మరోవైపు, ఉదయం 11 గంటలకు ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు చంద్రబాబు నాయుడు.