YS Jagan Tweet: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచకవాది. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతరేశారని.. అబద్దాలు చెప్పి, మోసాలు చేసి కుర్చీని లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. సీఎంగా చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.
Pulivendula-Byelection: మరి కాసేపట్లో ఉప ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది.. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం కాకరేపింది. గత వారం రోజులుగా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. దాడులతో పులివెందుల దద్దరిల్లిపోయింది. అయినా వైసీపీ వెనకడుగు వేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మైకులు మారు మోగాయి.
Pulivendula: కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి ఇవాళ (ఆగస్టు 10న) సాయంత్రం 5గంటలకు తెర పడనుంది. ఈ మేరకు మంగళవారం (ఆగస్టు 12న) నాటి పోలింగ్కు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది.
Ambati Rambabu Slams TDP:164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు జగన్ నామ జపం చేస్తున్నారని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.. తాజాగా అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీల ప్రక్రియ సంగతి మర్చిపోయి జగన్ కట్టడి కోసం పనిచేస్తున్నారని.. చిట్టి నాయుడు దెబ్బకు చంద్రబాబు బుర్ర కూడా పోయిందన్నారు.. జగన్ ను ఆపటం మీ తరం కాదు.. జగన్ వస్తే విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం…
రోడ్డు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. సింగపూర్ లాగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పదేళ్ల ముందే మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వ ఆర్కిటెక్ లతో అద్భుతమైన డిజైన్ చేయించారన్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వేల కోట్ల…
మాజీ మంత్రి పెద్దిరెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వీడియో వైరల్ అవుతోంది. ఈ అంశంపై తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. ఈ నెల 19తేదీన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినట్లు జరిగిందని తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇండిగో విమానంలో వెళ్ళే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా ప్రయాణం చేశారన్నారు.
మద్యం స్కాంలో త్వరలోనే జగన్ అరెస్ట్ అవుతారని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగన్ పాత్రపై కూడా విచారణ జరపాలన్నారు. మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్లో విజయ సాయి రెడ్డి వాటాలు తేలక బయటపడ్డారని ఆరోపించారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్లో ముఖ్య భూమిక వహించారని ఆరోపించారు. క్యాబినెట్లో మద్యం పాలసీని ఆమోదించిన వారందరినీ విచారణ…
మద్యం కుంభకోణంపై ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో సిట్ విచారణ తుది దశకు చేరిందన్నారు. అన్ని ఆధారాలతో గత పాలకులు అడ్డంగా దొరికారని.. ప్రజాధనం ఎలా దోచుకోవచ్చో మద్యం స్కామ్ ఒక పరాకాష్ఠ అన్నారు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
బాధ్యతారహితమైన ప్రతిపక్షం ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టమని మంత్రి పార్థసారథి అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిపైన జగన్ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. పోలవరంపై అబద్ధాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు.
Tadipatri Tension: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు.