ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి. ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోట. ఆ పార్టీకి ఎంతో సెంటిమెంటుతో కూడుకున్న నియోజకవర్గం తిరుపతి. టీడీపీ స్థాపించిన సమయంలో ఎన్టీఆర్ సైతం తిరుపతి నుంచి పోటిచేసి గెలిచారు. అంతగా పార్టీకి బలమైన క్యాడర్ వుంది తిరుపతిలో. గత ఎన్నికల్లో సైతం జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో నలభైవేల మెజారిటీతో ఓటమీ పాలైతే, ఇక్కడ మాత్రం కేవలం ఎనిమిది వందల ఓట్ల తేడాతో ఓడింది. 2014లోనూ, టిడిపి మంచి మెజారిటితోనే గెలిచింది. అలాంటి నియోజకవర్గాన్ని ఇప్పుడు…