తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆవిష్కరించారు. ఉత్తేజం ఉట్టిపడుతూ తెలుగుదేశం జెండా రెపరెపలాడింది.. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆనందంతో తెలుగుదేశం జిందాబాద్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువ నేత నారా లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి ఉదయగిరి ముద్దుబిడ్డ కాకర్ల సురేష్ అంటూ నినాదాలు చేశారు.
Read Also: Ranbir Kapoor: కూతురికి కోట్ల విలువైన బంగ్లాను గిఫ్ట్ గా ఇవ్వనున్న రణబీర్..
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. యుగపురుషుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు 1982లో స్థాపించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం జెండాను ఎగరవేయడం ఆనందంగా ఉందన్నారు. 42 వసంతాలు పూర్తి చేసుకుని ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని సుమారు 23 సంవత్సరాలు అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తుందన్నారు.. అలాగే, ఉదయగిరి కోటపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని కాకర్ల సురేష్ ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అతిరథ మహారథులు టీడీపీ నేతలు నాయకులు- జనసేన- బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.