వైయస్సార్ కడప జిల్లాకు సేవచేసి అభివృద్ధి పథంలో నడిపించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా? అని ప్రశ్నించారు. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారని తెలిపారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై…