దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీసీఎస్ సీఈవో పదవికి రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేశారు. కంపెనీ ఆయన స్థానంలో కె.కృతివాసన్‌ను ఇన్‌చార్జి సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.