సింగరేణిలో ఒకప్పుడు బలంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పరిస్థితి కొంత కాలంగా దయనీయంగా మారింది. బీఆర్‌ఎస్ పెద్దల కుటుంబంలో వచ్చిన విభేదాలు సంఘం మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయని.. సొంత యూనియన్ నేతలే చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు తాము ఎవరివైపు ఉండాలో అర్ధంగాక సతమతం అవుతున్నారట టీబీజీకేఎస్ నాయకులు. కవిత, కేటీఆర్‌లో ఎవరికి జై కొడితే... ఎవరు కన్నెర్ర చేస్తారోనని ఆందోళనగా ఉన్నట్టు సమాచారం. ఈ గందరగోళంతో... ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న టీబీజీకేఎస్ పరిస్థితి మరింత…
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింగరేణి లో గుర్తింపు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాగా వేయటానికి అటు ఏఐటీయూసీ ఇటు ఐఎన్టీయూసీ పావులు కదుపుతున్నాయి.
సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. ఈ సందర్భంగా.. అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధత గురించి చర్చలు జరిపారు. సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏక మొత్తంలో ఒకేసారి ఏరియర్స్ సింగరేణిలో ఉద్యోగులకు, కార్మికులకు చెల్లించేలా సింగరేణి సర్క్యులర్ విడుదల చేసింది. ఈనెల 21న ఉద్యోగులందరికీ చెల్లింపు చేయనున్నట్లు సర్క్యులర్ లో సింగరేణి యాజమాన్యం పేర్కొంది. breaking news, latest news, telugu news, big news, singareni employees, cm kcr, TBGKS,