గత వారంలో మూడు రోజుల పాటు ఢిల్లీ, ముంబైలో గల బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖ సర్వే కార్యకలాపాల తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం పార్లమెంట్‌లో బీబీసీని, దాని సంపాదకీయ స్వేచ్ఛను గట్టిగా సమర్థించింది.
బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సర్వే గురువారం వరుసగా మూడో రోజు కొనసాగుతోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎంపిక చేసిన బీబీసీ సిబ్బంది నుంచి ఆర్థిక డేటాను సేకరించారు.