పన్ను మినహాయింపులు కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధిక రిటర్న్ లు దాఖలయ్యాయని.. అవన్నీ తప్పుల తడకలని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత తెలిపారు. గడిచిన మూడేళ్లుగా తెలంగాణ, ఏపీలో తప్పుడు క్లెయిమ్‌లతో ఉద్యోగులు అత్యధిక రిటర్న్ లు దాఖలు చేసి.. రిఫండ్ పొందినట్టు తమ విచారణలో తేలిందన్నారు.