మన దేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌లోని టాటా స్టీల్ పలు దేశాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్‌లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ పూనుకుంది.