అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిరామ్ తరోన్ అనే 17 ఏళ్ల బాలుడి కథ సుఖాంతం అయింది. తరోన్ ని ఎట్టకేలకు చైనా బలగాలు భారత సైన్యానికి అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ళ బాలుడు తరోన్ ఈ నెల 19 నుంచి కనిపించకుండా పోయాడు. ఇటీవల చైనా బలగాలు తరోన్ ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించాయి. అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ దీనిపై స్పందించారు. సరిహద్దు ప్రాంతంలో మూలికల…