Prashant Kishor: లోక్‌సభ ఎన్నికలు ముంచుకువస్తున్నాయి. వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈసారి బీజేపీనే స్వతహాగా 370 సీట్లను సాధిస్తుందని, ఎన్డీయే కూటమి 400కి మించి సీట్లను గెలుస్తుందని ప్రధాని మోడీతో పాటు కేంద్ర నాయకత్వం చెబుతోంది.