నాపరాతిని తమకున్న ఆర్డర్ల కోసం వివిధ ప్రాంతాలకు లారీలలో, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. కానీ వాటిని తరలింపు ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నాపరాతి బండలను లారీలలో, ట్రాక్టర్లలో బాడీ లెవెల్ వరకు నింపకుండా.. అధిక లోడ్డుతో వెహికిల్స్ లో నింపుకొని రోడ్లపైకి రావడం వల్ల.. వెనక వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో గుండెపోటుతో మృతి చెందిన అల్లుని మృతదేహాన్ని చూసి తట్టుకోలేక మామ కూడా అనంత లోకాలకు వెళ్లాడు. తాండూర్ లోని బృందావన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మోయిన్ అహ్మద్ హార్ట్ ఎటాక్ తో మరణించాడు. అతని మృతదేహాన్ని చూసి స్పృహ కోల్పోయి మున్నాభాయ్ ను.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడంతో మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఓ వైపు పరీక్ష కొనసాగుతుండగా.. తాజాగా పేపర్ లీకేజ్ కలకలం రేపుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రశ్నపత్రం లీకు కలకలం రేపింది.