కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చినప్పటినుంచి అన్ని నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ అలాగే వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని కొనుగోలు చేసేందుకు సామాన్య ప్రజలు.. భయపడిపోతున్నారు. ఇక తాజాగా… టమాట ధరలు కూడా సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం టమాటో ధరలు కిలో ధర 130 రూపాయలు దాటేసింది. దీంతో ఓటరు కొనేందుకు సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
ఇలాంటి తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టమాటాలను రాష్ట్ర ప్రజలకు కేవలం 70 రూపాయలకు మాత్రమే అందించాలని… అధికారులను ఆదేశించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ప్రభుత్వ దుకాణాల్లో ఇకనుంచి డెబ్భై రూపాయలకే టమోటాలు అందించాలన్నారు. స్టాలిన్ తీసుకున్న తాజా నిర్ణయంతో తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.