తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత రెండు నెలలుగా తమిళనాడు ముఖ్యమంత్రి వితండ వాదం చేస్తున్నాడని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో మాకు అన్యాయం చేయడానికి మోదీ కుట్ర పన్నాడు అని మాట్లాడుతున్నారు.. అది పూర్తిగా రాజకీయపరమైన విమర్శ అని పేర్కొన్నారు.
బీజేపీ పార్టీతో పొత్తుకు ఏఏంఏంకే పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు. తాజాగా టిటివీ దినకరన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో భేటి అయ్యారు. ఇందులో భాగంగా వచ్చే లోక్ సభ ఎన్నికలలో కలసి పోటి చేయడానికి రెండు పార్టీ పరస్పర అంగీకారం తెలిపాయి.
తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి చీలిపోతూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలంతా ఏఐఏడీఎంకే పార్టీకి వరుస కడుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య వివాదం ముదురుతోంది.