కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం ఫ్యాక్టరీల (సవరణ) చట్టం 2023ని ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సోమవారం తెలిపారు. సంస్కరణలను తీసుకురావడానికి మాత్రమే కాకుండా, ఒక సమస్యపై ఏకాభిప్రాయ అభిప్రాయాన్ని అంగీకరించడానికి కూడా ధైర్యం అవసరమని నొక్కిచెప్పిన ఆయన.. అనేక కార్మిక సంఘాలు వ్యక్తం చేసిన భయాందోళనలను అనుసరించి వివాదాస్పద చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు.
పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలను మార్చి 1న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార డీఎంకే సన్నాహాలు చేస్తోంది. నవజాత శిశువులకు బంగారు ఉంగరాల బహుమతి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అన్నదానం వంటి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పెద్ద కుమారుడు ఉదయనిధి వచ్చేవారం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర కనబర్చిన యువ నాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ గుర్తింపు పొందారు.