Tamil Nadu Rains: భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం మరోమారు అల్లాడిపోతోంది. దక్షిణ తమిళనాడులో కూరుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. తిరునెల్వెలి, టుటికోరిన్, టెంకాసి, కన్యాకుమారి జిల్లాల్లో కూరుస్తున్న కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్లు విద్యుత్ సరఫరా పూర్తిగా…
Heavy Rain Hits Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం తమిళనాడులోని దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి మరియు కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయంగా మారడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు బ్యాంకులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూత్తుకుడి జిల్లాలోని…