India Weather Update: దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా, ఉత్తర భారతదేశంలో చలి క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా అనేక రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఈ రోజు వర్షం పడే అవకాశం ఉంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని, కొన్ని చోట్ల తేలికపాటి గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా, ఉష్ణోగ్రత తగ్గింది. ఉదయం, సాయంత్రం వేళలో చలిగాలులు వీస్తున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో కేరళ, కర్ణాటక, యానాం, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో…
తమిళనాడు వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. చెన్నై ఎయిర్‌పోర్టులోకి వరద నీళ్లు చేరడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలోని అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Tamilnadu : తమిళనాడులో ఆది, సోమవారాల్లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. తిరునెల్వేలి, తూత్తుకుడి సహా దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
చెన్నై మహానగరం కుండపోత వర్షాలతో గజగజా వణుకుతోంది. ఎక్కడ చూసినా ఈ రెండే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ ఇప్పటికీ నదులను తలపిస్తున్నాయి. చాలా కాలనీలు నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. తినడానికి తిండిలేక, రాత్రిపూట కరెంటు లేక చెన్నై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గురువారం ఉదయం. 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు మీనంబాకంలో 60 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే, నగుబాకంలో 43 మిల్లీ…
తమిళనాడుకు ఒక వరుణగండం తీరింది.. చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరం దాటింది. లాండ్ ఫాల్ తర్వాత వాయుగుండం తీవ్ర తగ్గుతుందని వాతావరణశాఖ చెబుతోంది. అయితే, శుక్రవారం కూడా తమిళనాడు వ్యాప్తంగా అతిభారీ నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, తీరం దాటిన తర్వాత ఊడా కొన్ని గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. ఇటు తూర్పు…