బాలీవుడ్ దర్శకుడు శాంతారామ్ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారతీయ సినిమాకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న శాంతారామ్ తన సినీ ప్రయాణంలో 90కి పైగా సినిమాలు నిర్మించి, 55 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన సేవలకు పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కూడా దక్కాయి. ఇక ఈ బయోపిక్ లో తమన్నా ఒక ముఖ్యపాత్రలో నటించబోతోంది. ఈ విషయాన్ని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ.. తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.…