కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో రాజకీయ ప్రత్యర్థుల చేతిలో దాడికి గురైన వైసీపీ కార్యకర్తలు గిరిధర్ (ఆర్‌ఎంపీ డాక్టర్), సతీష్‌ను ఫోన్‌లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ఘటన వివరాలు ఆరా తీశారు.
అనకాపల్లి తాళ్లపాలెంలోని రేషన్ డిపో లో ఆకస్మికంగా తనిఖీలు చేసారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం కింద ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు సరఫరా పై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న రేషన్ బియ్యం, సరుకులు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్న ఆర్థిక మంత్రి… కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యన్ని కేంద్రం పేరుతోనే ఇవ్వాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం…