KTR : జైపూర్‌లో జరుగుతున్న టాక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చా కార్యక్రమంలో తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ రాజకీయాలు, నియోజకవర్గ పునర్విభజన, భాషా విధానాలు వంటి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ బీహార్ ఎన్నికల ఓటర్ల సవరణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం, పార్లమెంటు సీట్ల కేటాయింపులోని అసమానతలపై విస్తృతంగా మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడుతూ, “బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ ఇది…