పిల్లికి చెలగాటం ..ఎలుకకు ప్రాణ సంకటం. ఆఫ్గన్ మహిళల పరిస్థితి అలాగే ఉంది. ముఖ్యంగా మహిళా క్రికెటర్లు. తాలిబాన్లు చంపుతారన్న భయంతో టీమ్ టీమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కాబుల్‌లో తాలిబాన్లు ఇప్పటికే మహిళా క్రికెటర్ల కోసం వేట మొదలుపెట్టారు. క్రికిటర్లే కాదు ఇప్పుడు దేశంలో ఏ క్రీడాకారిణికి రక్షణ లేదు. కాబూల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. క్రికెట్ జట్టు సభ్యులంతా నిస్సహాయస్థితిలో ఉన్నారు. గత నెల మధ్యలో తాలిబాన్లు కాబూల్‌ని అక్రమించుకున్నప్పటి నుంచి వారికి క్రీడాకారిణిలు టార్గెట్…
మేమింతే.. మారేదే లేదు.. తాలిబాన్లు కుండ బద్దలు కొట్టారు . ఆఫ్గనిస్తాన్‌లో షరియా పాలనే సాగుతుందని తేల్చేశారు. అఫ్గానిస్తాన్ ఇకపై అధికారికంగా ‘‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్’’అవుతుంది. తాలిబాన్ల విధానాలు ఎలా వుండబోతున్నాయని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజా ప్రకటనతో దానికి తెరపడింది. ఇక, ముందు ముందు వాళ్లు ఏం చేస్తారో చూడాల్సివుంది. ఆఫ్గనిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతో మళ్లీ ఆక్కడ తాలిబాన్ శకం మొదలైనట్టయింది. ఇకపై తాలిబన్ సుప్రీం లీడర్ మౌల్వీ హిబైతుల్లా…
ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు.. ఇక, మహిళలపై క్రమంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు తాలిబన్లు.. తాజాగా అమ్మాయిలు, మహిళలు ఎలాంటి క్రీడలు ఆడకూదంటూ ఆంక్షలు విధించింది తాలిబన్ సర్కార్.. ఆఫ్ఘన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.. వారు ఎలాంటి ఆటలు ఆడేందుకు అనుమతి లేదని పేర్కొంది. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదు.. క్రీడలతో బాడీ ఎక్స్‌పోజింగ్ అవుతుందని వ్యాఖ్యానించారు తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ హెడ్…
ఆప్ఘనిస్థాన్‌ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించిన తాలిబన్లు.. ఇక, ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టారు.. ఆ దేశ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచే ఈ చర్చ సాగుతోంది.. తాజాగా.. తాలిబన్లకు కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్‌షీర్‌ను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు ప్రకటించారు. ఇక, తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంటోంది… తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు…
దొంగదెబ్బ.. వెన్నుపోటు. పాకిస్థాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. తాలిబన్లతో ఎలాంటి సంబంధం లేదని పైకి చెబుతూనే వాళ్ల తరఫున యుద్ధం చేసేందుకు ఉగ్రవాదులను పంపింది పాక్. పంజ్ షీర్ సింహాలను నేరుగా ఢీకొట్టలేని తాలిబన్లు.. కుట్రలమారి పాకిస్థాన్ అండ తీసుకున్నారు. యుద్ధంలో తామే గెలిచా మని పంజ్ షీర్‌లో జెండా ఎగరేశారు. పంజ్ షీర్ గవర్నర్ బంగ్లా దగ్గర తాలిబన్ నేతలు ప్రశాంతంగా కనిపిస్తున్నా.. దాని కొండ ప్రాంతంలోని లోయల్లో మాత్రం భీకర యుద్ధం నడుస్తోది. పచ్చటి…
సున్నిత అంశాలపై ఏమాత్రం నోరు జారినా రచ్చే. పెద్ద వివాదంగా మారుతుంది. హిందీ ఫిలిం రైటర్ జావేద్ అక్తర్ మాటలు మంటలు రేపుతున్నాయి. ఆరెస్సెస్‌ని ఆయన తాలిబాన్లతో పోల్చటం తీవ్ర వివాదాస్సదమైంది. తాలిబాన్ల అనాగరిక చర్యలను ఖండించాలని,ఇప్పుడు కొందరు ఆ పనే చేస్తున్నారని జావెద్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అదే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీగా మారింది. ముంబై లో నిరసన జ్వాలలుఎగిసిపడుతున్నాయి. తక్షణం క్షమాపణ చెప్పాలని…లేదంటే దేశ వ్యాప్తంగా ఆయన సినిమాల రిలీజ్‌ని అడ్డుకుంటామని ఘాట్‌కోపర్…
తాలిబన్లు కలక ప్రకటన చేశారు. పంజ్‌షీర్‌ను కైవసం చేసుకున్నట్టుగా ప్రకటించారు. పంజ్‌షీర్ కైవసంతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల కైవసం అయింది. ఇక అమ్రుల్లా సలేహ్ ఇంటిని తాలిబన్లు డ్రోన్లతో పేల్చివేశారు. పంజ్‌షీర్ రాజధానిలోని గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు తెలుపు జెండాను ఎగరవేశారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు తాలిబన్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోరులో తాలిబన్లు పూర్వమిత్రులైన అల్‌ఖైదా సహాయం తీసుకోవడంతో విజయం సాధించినట్టు సమాచారం. మరో రెండు మూడు…
ఆఫ్ఘనిస్తాన్‌లో అంతర్యుద్ధం జరుగుతున్నది. ఎలాగైనా పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను అక్రమించుకోవాలని తాలిబన్లు చూస్తున్నారు. తాలిబన్లకు పంజ్‌షీర్ మాత్రమే కాకుండా, వారి చెర నుంచి ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని విడిపించాలని పంజ్‌షీర్ దళం పోరాటం చేస్తున్నది. పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి. ఈ ఎనిమిది జిల్లాలలో పెద్ద ఎత్తున తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నది. అయితే, తాము పంజ్‌షీర్‌లోని 4 జిల్లాలను ఆక్రమించుకున్నామని, పంజ్‌షీర్ రాజధాని బజారక్ లోని గవర్నర్ కార్యాలయంలోకి కూడా ప్రవేశించామని తాలిబన్లు చెబుతుంటే, పంజ్‌షీర్…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆగస్టు 15 వ తేదీన తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్నారు. తాలిబన్లు కాబూల్ ను ఎలా ఆక్రమించుకున్నారు అనే విషయంపై ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కీలక సమాచారం అందించారు. ఆగస్టు 15 వ తేదీన పోలీస్ చీఫ్ తనకు ఫోన్ చేశారని, జైల్లో యుద్ధఖైదీలు తిరుగుబాటు చేస్తున్నారని, అణిచివేతకు సహాయం కావాలని కోరారని, అయితే, రక్షణ మంత్రి, హోమ్ మంత్రికి ఫోన్ చేసినా లాభం లేకపోయిందని,…