తాలిబన్ పాలన మొదలై సోమవారానికి ఏడాది పూర్తైనా ప్రపంచ దేశాలు మాత్రం వారిని అధికారికంగా గుర్తించకపోవడంతో ఇంకా ఏకాకిగానే మిగిలిపోయింది. ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తైన సందర్భంగా సెలవు దినంగా ప్రకటించారు.
ఆఫ్గాన్‌లో పరిస్థితి చేయిజారిపోయింది. ఒక్కో నగరం తాలిబన్ల చెరలో చేరిపోతోంది. ఇప్పటికే 34 ప్రొవిన్షియల్ రాజధానుల్లో 10.. తాలిబన్ల వశమయ్యాయి. ఆ దేశంలోని 65 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా లోగర్ ప్రావిన్స్ ప్రాంతాన్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. కందహార్, హెరత్ నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన గంటల్లోనే లోగర్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు ప్రకటించారు. తాలిబన్లు చేజిక్కించుకున్న లోగర్ ప్రావిన్స్… ఆ దేశ రాజధాని కాబూల్‌కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమెరికా, నాటో సేనలు…