ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రపంచ దేశాలు ఆ దేశంపై నిషేధం విధించాయి. ఏ దేశం కూడా ఇప్పటి వరకు తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. దీంతో ఆ దేశానికి చెందిన విదేశీ నిధులు స్తంభించిపోయాయి. దీంతో దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఉద్యోగాలు కోల్పోయాలు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో శాంతి భద్రతలను పునరుద్దరించామని, ఇప్పటికైనా దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించాలని…