V.V.Vinayak Birthday: వినాయక్ అంటే విక్టరీ… విజయమంటే వినాయక్ అన్న రీతిలో సాగిన దర్శకుడు వి.వి.వినాయక్. తెలుగులో పలువురు టాప్ స్టార్స్ తో బంపర్ హిట్స్ చూసిన వినాయక్ ప్రస్తుతం హిందీ చిత్రసీమలో తొలి అడుగు వేస్తున్నారు. తన మిత్రుడు రాజమౌళి తెలుగులో రూపొందించిన బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’ ఆధారంగా హిందీలో వినాయక్ తన తొలి సినిమాను తెరకెక్కిస్తున్నారు. తనను దర్శకునిగా పరిచయం చేసిన నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు హీరో సాయి శ్రీనివాస్ ను ఈ…
ఆరే ఆరు నెలలు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు.. ఇతర నాయకులు నోళ్లు కట్టుకుని కూర్చున్నారు. తమ సహజ శైలికి భిన్నంగా మౌనం దాల్చారు. ఆ కూలింగ్ పీరియడ్ అయిపోయిందని అనుకున్నారో ఏమో.. మళ్లీ పూర్వ పద్ధతిలోకి వచ్చేశారు. కాంగ్రెస్‌లో అంతే అనే రీతిలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నారు. నేరుగా పీసీసీ చీఫ్‌కే గురిపెట్టేవారు కొందరైతే.. సీనియరైతే నాకేంటి అనేలా మరికొందరి వైఖరి ఉంది. ఇలాంటి సమస్యలు వస్తే గతంలో AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్నవాళ్లు వెంటనే…
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు చింతన్ శిబిర్ నిర్వహించింది. నాయకులు వచ్చారు…తీర్మానాలు చేసి వెళ్ళారు. కానీ…నాయకులు..క్యాడర్‌కి ఏం చెప్పారనే చర్చ మొదలైంది. చింతన్ శిబిర్‌లో వేసిన కమిటీ చైర్మన్ల సమావేశం ముగియక ముందే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ వెళ్ళిపోయారు. నాయకులు అంతా..మనసు విప్పి చెప్పండి సమస్యలు అంటే…ఇన్నాళ్ళు గోప్యంగా నడిచిన వ్యవహారం అంతా…నాయకులు ఓపెన్ చేశారు. సమస్యలు బయటకు చెప్పిన వారంతా…ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. కనీసం టాగూర్ చెప్పిన సమస్యలకు సమాధానం…
రాష్ట్ర నేతల అనుభవం ముందు ఇంఛార్జ్ ఠాగూర్ తేలిపోతున్నారా? మాణిక్యం ఠాగూర్. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ. తెలంగాణ వరకు AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్. రాష్ట్రానికి ఇంఛార్జ్‌గా వచ్చినప్పుడు ఠాగూర్ గురించి ఏదేదో అనుకున్నారు. కానీ.. పార్టీ నాయకులను ఆయన గాడిలో పెట్టలేకపోతున్నారని తెలియడానికి ఎంతో టైమ్ పట్టలేదు. ఇందుకు ఠాగూర్ అనుభవ రాహిత్యం.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల అనుభవం ముందు తేలిపోతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కమాండింగ్ లేదు.. కంట్రోలింగ్ అంతకంటే…
టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మూడున్నర గంటల పాటు జరిగింది. మూడున్నర గంటల పాటు శాంతియుతంగా సమావేశం నిర్వహించినట్టు నేతలు తెలిపారు. నాయకులు వ్యక్తిగత సమస్యలు ఉంటే…మానిక్కం ఠాగూర్ తో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని సూచించారు కన్వీనర్ షబ్బీర్ అలీ. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలను సమాన శత్రువులుగా అభివర్ణించింది పీఏసీ. కేసీఆర్ రాహుల్ గాంధీ కి మద్దతు ఇచ్చి…ఏడేళ్లుగా పార్టీని తిట్టిన తీరు మర్చిపోలేం అన్నారు. పోలీస్ స్టేషన్ లలో అస్సాం సీఎం పై ఫిర్యాదులపై…