టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ టీమిండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్టు మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్… మొదటి ఫీల్డింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి మొదట బ్యాటింగ్ చేయనుంది టీమిండియా. ఇక జట్టు వివరాల్లోకి వెళితే… ఆఫ్ఘనిస్తాన్ : హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(w), రహమానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(c), కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్…
టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయం కోసం టీమిండియా ఆరాటపడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై పరాజయం ఎదురు కావడంతో భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో బుధవారం పసికూన అప్ఘనిస్తాన్‌తో కోహ్లీ సేన తలపడనుంది. అబుదాబీ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. అయితే అఫ్ఘనిస్తాన్ జట్టును మనోళ్లు అంత లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ…
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ విజయానికి గట్టి పునాది పడింది. అబుదాబీ వేదికగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఓపెనర్ రిజ్వాన్‌ను అంపైర్ ఎల్బీగా అవుట్ చేయగా రివ్యూ తీసుకున్న పాకిస్థాన్ విజయవంతమైంది. అనంతరం ఓపెనర్లు రిజ్వాన్ (79 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (70) తొలి వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం అందించారు. 14.2 ఓవర్ల వద్ద పాక్…
t20ప్రపంచ కప్‌లో వరుస ఓటములతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ప్రమాదంలో పడనున్నట్టు తెలుస్తోంది. కెప్టెన్సీ మార్పుపై త్వరలో జరగనున్న బీసీసీఐ సెలెక్టర్ల సమావేశంలో చర్చ జరగనుందని ఓ అధికారి తెలిపారు. వరుస ఓటములు టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో బీసీసీఐ అసంతృప్తిగా ఉందని, కోహ్లీని వన్డే సారథ్యం నుంచి కుడా తప్పించాలని భావిస్తున్నట్టు తెలిపారు. వన్టేలు, టీ20లకు రోహిత్ లేదా మరెవరైనా.. టెస్టులకు కోహ్లీని సారథిగా ఉంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కోహ్లీకి…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా పరాజయం పాలు అవుతుండటంతో అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభిమానులు అయితే హద్దు మీరి విమర్శలు చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె వామికను అత్యాచారం చేస్తామని బెదిరించారు. ఈ విషయంలో విరాట్ కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. ‘డియర్ విరాట్.. కొంతమంది మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. జట్టును రక్షించుకో’ అంటూ…
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. బట్లర్ (67 బంతుల్లో 101 నాటౌట్) మినహా జాసన్ రాయ్ (9), మలాన్ (6), బెయిర్ స్టో (0) విఫలం కావడంతో ఇంగ్లండ్ జట్టు ఆచితూచి బ్యాటింగ్ చేసింది.…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని జట్ల కంటే ముందుగా దుబాయ్ చేరుకుని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా పిచ్‌లపై అవగాహన ఉన్న టీమిండియా క్రికెటర్లు దారుణంగా ఆడుతున్నారని పలువురు క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. పటిష్టమైన పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై ప్రణాళిక ప్రకారం ఆడకుండా కోహ్లీ సేన భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టీమిండియాకు సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారినా.. పూర్తిగా అయితే దారులు మూసుకుపోలేదు. టీమిండియా సెమీస్ చేరాలంటే…
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-2లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. టీమిండియా విధించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 14.3 ఓవర్లలో కివీస్ చేధించింది. ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ (49), కెప్టెన్ విలియమ్సన్ (33 నాటౌట్) రాణించి తమ జట్టుకు…
టీ20 ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషాన్ (4), కేఎల్ రాహుల్ (18) చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ (14), కోహ్లీ (9) కూడా వారినే అనుకరించారు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ (12), హార్డిక్ పాండ్యా (23), జడేజా…
టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ రెండో విజయం సాధించింది. ఆదివారం మధ్యాహ్నం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో ఆప్ఘనిస్తాన్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో ఆ జట్టు రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ షాజాద్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. 33 బంతులాడిన ఈ భారీకాయుడు 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అలరించాడు.…