టీటీడీపై ప్రశంసలు కురిపించారు కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి… తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించింది.. పాదయాత్రలో పాల్గొన్నారు కేంద్ర మాజీ మంత్రులు టి. సుబ్బరామిరెడ్డి, చింతా మోహన్.. అంబేద్కర్ భవన్ వద్ద జరిగిన బహిరంగ సభలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. టీటీడీ పరిపాలను ప్రస్తుతం చాలా బాగుంది.. టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.. అన్యాయానికి అవకాశం లేకుండా భక్తులకు సేవ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ఎంత మంచి పాలన…