తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు, ముఖ్యంగా శ్రామిక మహిళల సురక్షిత ప్రయాణానికి ఉద్దేశించిన ‘టీ-సేఫ్’ వ్యవస్థ దేశంలోనే ఒక విప్లవాత్మక ముందడుగు అని తెలంగాణా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఇటీవల జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్‌లో ‘టీ-సేఫ్ – మహిళల కోసం సురక్షిత ప్రయాణం’ అనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చి, ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క విశిష్టతను వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2022 ప్రకారం,…
అమ్మాయిలు, మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్చి 12 2024లో, టీ సేఫ్ అనే యాప్ ను లాంచ్ చేశారు. ఇప్పటివరకు 15,000 మందికిపైగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళల ప్రయాణ సమయంలో, పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తోంది.