అమ్మాయిలు, మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్చి 12 2024లో, టీ సేఫ్ అనే యాప్ ను లాంచ్ చేశారు. ఇప్పటివరకు 15,000 మందికిపైగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళల ప్రయాణ సమయంలో, పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం టి-సేఫ్ (T-SAFE) యాప్ ను ప్రారంభించారు. మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్ ను రూపొందించారు. T-SAFE ద్వారా మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ సేవలను పోలీసుశాఖ అందిస్తుంది. కాగా.. అన్ని రకాల మొబైల్‌ఫోన్‌లకు అనుకూలంగా ఉండేలా ఈ యాప్ ను తయారు చేశారు. సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.