భగవద్గీతపై టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ఈ దేశంలోని ప్రజలందరికీ హిందువులకు భగవద్గీత కంటే, ముస్లింలకు ఖురాన్ కంటే, క్రైస్తవులకు బైబిల్ కంటే పవిత్రమైనదని వ్యాఖ్యానించారు. “బైబిల్, భవద్గీత, ఖురాన్ వల్ల మన జీవితాలు మారలేదు, కేవలం భారత రాజ్యాంగం వల్లనే ప్రజల జీవితాలు మారిపోయాయన్నారు.…