ఇప్పుడు ఈ నక్షత్రం శాస్త్రవేత్తలతో పాటు ఖగోళ ఔత్సాహికుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. 1946లో చివరిసారిగా ఇది కనిపించింది. నార్తర్న్ క్రౌన్ నక్షత్రమండలంలో విస్పోటనం చెందిన సమయంలో భూమి నుంచి చివరిసారిగా ఈ నక్షత్రం కనిపించింది. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మళ్లీ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. ఏ క్షణంలో అయినా ఈ నక్షత్రం ఆకాశంలో దర్శనమిస్తుందని చెబుతున్నారు.
T Coronae Borealis: మన జీవితంలో ఎప్పుడూ చూడని, జరగని సంఘటన విశ్వంలో చోటు చేసుకోబోతోంది. ప్రస్తుతం T కరోనియా బొరియాలిసిస్(T CrB) అనే నక్షత్రం పేలేందుకు సిద్ధమైంది.