శరీరంలోని కణాల అసాధారణ పెరుగుదల పలు రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. వాటిల్లో ఒకటి బ్రెయిన్ క్యాన్సర్. మెదడులోని కణాల అసాధారణ పెరుగుదల దీనికి కారణం అవుతుంది. ఇది మెదడులో కణితుల పెరుగుదలకు దారితీస్తుంది. ప్రాధమిక మెదడు కణితులు బ్రెయిన్ లోనే పుట్టుకొస్తాయి. ద్వితీయ కణితులు శరీరంలోని ఇతర భాగాల నుంచి మెదడుకు వ్యాపిస్తాయి. బ్రెయిన్ క్యాన్సర్ కు గురైన వ్యక్తుల్లో తలనొప్పి, మూర్ఛలు, దృష్టి సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, వికారం, వాంతులు వంటివి సాధారణ లక్షణాలు…