సిరియా అధ్యక్షుడు అసద్ భవిష్యత్‌ను ముందే ఊహించినట్లుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చక్కబెట్టుకున్నట్లు సమాచారం. తాజాగా అతడి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులు రష్యాకి చేరుకున్నారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న కోవడంతో తన కుటుంబంతోపాటు అధ్యక్షుడు రష్యాలోని మాస్కోకి చేరుకున్నారు."అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో రష్యా ఆశ్రయం కల్పించింది" అని స్థానిక వార్తా సంస్థ నివేదిక పేర్కొంది.