పండగవేళ తమ సంతోషాలను స్వీట్స్ తో సెలబ్రేట్ చేసుకునే వారికి బిగ్ షాక్. స్వీట్స్ ఎంతో టేస్టీగా ఉన్నాయని లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్వీట్స్ తయారీలో విచ్చలవిడిగా రసాయన పదార్థాలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని పలు స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 45 షాపుల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. స్వీట్స్ తయారీ లో విచ్చలవిడిగా…