Maharashtra: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్‌లైన్ పెట్టుకుంది బీజేపీ. కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవ తేదీని బీజేపీ ప్రకటించింది. అయితే, ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 05 సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఐకానిక్ ఆజాద్ మైదాన్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి.
ఒడిశాలో బుధవారం ఆసక్తికర సన్నివేశం ఆవిష్కతమైంది. ఒకే స్టేజీపై ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్-ప్రధాని మోడీ ఎదురుపడ్డారు. కొంత సేపు స్టేజీపైనే సంభాషించుకున్నారు. దీంతో చుట్టూ ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వెలసిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలతో బ్యానర్లు వెలశాయి. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసిన బ్యానర్లను టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఎల్లుండి (గురువారం) జరగనున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.