విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’పై అంచనాలు భారీగా ఉన్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్రంలో నిఖిల్ ఒక పవర్ఫుల్ యోధుడిగా కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, దీనిని రెండు భాగాలుగా (Part 1 & Part 2) విడుదల చేయనున్నట్లు నిఖిల్ స్వయంగా వెల్లడించారు.…