Swati Maliwal Assault: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేసిన ఘటన సంచనలంగా మారింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సొంత పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌తో సీఎం నివాసంలో జరిగిన గొడవ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు.
సీఎం నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసు రోజురోజుకూ ఊపందుకుంది. ఈ కేసులో పోలీసులు మలివాల్‌ను నాలుగు గంటల పాటు విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.